తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రూడ్ పామాయిల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడిన ఘటన దమ్మపేట మండలంలోని కొమ్ముగూడెం శివారులో రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి తమిళనాడుకు 25 టన్నుల క్రూడ్ పామాయిల్ లోడుతో ట్యాంకర్ బయలుదేరింది. ఈ క్రమంలో కొమ్ముగూడెం శివారులో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. లారీడ్రైవర్, క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదు
Admin
తెలుగు వెలుగు టీవీ