తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం పట్టణంలోని అంబేద్కర్ భవన్ ( మాదిగ సంక్షేమ సంఘం ) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న అధ్యక్షత వహించగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేష్ మాట్లాడుతూ పూలే మహారాష్ట్రలోని పూణే ప్రాంతంలో ఏప్రిల్ 11, 1827న జన్మించడం జరిగిందని, తన తండ్రి గారైన గోవిందరావు పూలే పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. ఆ రోజుల్లో దళిత బహుజన ల మీద అనేక దాడులతో పాటు విద్యకు దూరంగా ఉంచుతూ అంటరాని వారిగా చూసేవారు. సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకున్న పూలే ఆమెకు స్వయంగా విద్యను నేర్పుతూ 1848 లో దళిత బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా భార్య సావిత్రిబాయి పూలే భారత దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా వ్యవహరించారు 1873, సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి విద్యను అందించడమే కాక మహిళలకు అనేక హక్కులు సాధించారు , ఆ తథనంతరం నవంబర్ 28, 1890లో మృతి చెందారు. మహాత్మ జ్యోతిరావు పూలే కు భారతరత్న ఇవ్వాలన్నారు ఎందుకంటే 1954లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిబిసి టీవీ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నా గురువులు ముగ్గురు గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే, కబీర్ దాస్ అని చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య జిల్లా నాయకులు మాతంగి లింగయ్య, కొత్తూరు మదనయ్య, సావటి స్వామి,కూరగాయల శ్రీను, ఇండిగపల్లి శంకర్, కాంపెళ్లి దుర్గయ్య, తిప్పారపు ఎల్లయ్య, నాగేల్లి మొగిలి, శనిగారపు కుమారస్వామి, కొత్తూరి రవి,మాటేటి అంజయ్య,మద్దికుంట గణేష్, నమిల్ల మధు,అన్నవరం, ఎస్.కె నాగుల్ మీరా, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ