Tuesday, 28 July 2026 06:41:08 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గ్రంథాలయ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన వీరబాబు

Date : 17 July 2025 05:11 PM Views : 1095

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పసుపులేటి వీరబాబు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా, పలు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యకలాపాల ఇన్చార్జిగా, కొత్తగూడెం ములుగు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ బాధ్యునిగా, ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పలు హోదాల్లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడినిగా పేరున్న ఆయనను గ్రంథాలయ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. జిల్లా గ్రంథాలయ కార్యదర్శి కరుణ కుమారి ఆయనకు పుష్పగుచ్చాన్ని అందించి ఘన స్వాగతం పలకడం తో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె వీరబాబుకు జిల్లా గ్రంథాలయ ఉద్యోగులను పరిచయం చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను త్వరలో పరిశీలిస్తానని, ఆయా గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించే దిశగా కృషి చేయనున్నట్లు తెలిపారు. గ్రంథాలయాలు ప్రత్యక్ష దేవాలయాలతో సమానమని, అలాంటి దేవాలయాలను సంపూర్ణంగా తీర్చిదిద్ది ఉద్యోగులు సిబ్బంది సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుతానని తెలిపారు. అంతా కలిసిమెలిసి పని చేద్దామని, పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికి పాఠకులకు అనుకూలమైన వాతావరణాన్ని గ్రంథాలయాల్లో మరింతగా ఏర్పాటు చేద్దామని తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రంథాలయాల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ ఇంచార్జ్ ఎం నవీన్ కుమార్, గ్రంథ పాలకులు జి. మణి మృదుల, నాగన్న, మధుబాబు అశ్వరావుపేట నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులు పల్లె వరప్రసాద్, లక్ష్మీదేవి పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జల్లారపు ఈశ్వర్, భద్రాద్రి బీసీ సంఘం ఉపాధ్యక్షులు బండి శ్రీకాంత్ గౌడ్, లక్ష్మీదేవి పల్లి మండలం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లావుడియా నరేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :