Tuesday, 28 July 2026 04:19:54 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పెరటి కోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 07 February 2026 05:28 PM Views : 249

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెరటి కోళ్ల పెంపకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయ సమాకూరుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ఎస్సీ కాలనీలో గ్రామీణ కుటుంబాల జీవనోపాధి స్థాయి మెరుగుదల లక్ష్యంగా నిర్వహించిన పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పెరటి కోళ్ల పెంపకం ద్వారా కుటుంబ అవసరాలకు సరిపడా ఆదాయం లభించడంతో పాటు పోషక విలువలు గల ఆహారం కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. లబ్ధిదారులు కోళ్లను శ్రద్ధతో, సరైన సంరక్షణతో పెంచుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 50 యూనిట్లను గాను, 50 మంది మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20 చొప్పున కోడి పిల్లలను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి లబ్ధిదారులకి 10 కిలోల కోళ్ల దాణా తో పాటు అవసరమైన ఫీడర్లు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పెరటి కోళ్ల పెంపకంలో పాటించాల్సిన ప్రాథమిక అంశాలు, కోళ్లకు అందించాల్సిన ఆహారం, నివాస ఏర్పాట్లు, వ్యాధుల నివారణ, టీకాల నిర్వహణ తదితర అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఎన్‌ఎంఆర్‌ఐ, హైదరాబాద్‌కు చెందిన సీనియర్ సైంటిస్ట్ డా. యోగేష్ దడేకర్ మాట్లాడుతూ పెరటి కోళ్ల పెంపకం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుందని వివరించారు. ఐడీఓ గట్టుమల్ల డా. కపిల్ శర్మ పెరటి కోళ్ల పెంపకాన్ని దీర్ఘకాలిక జీవనోపాధిగా అభివృద్ధి చేసుకునే విధానాలపై విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో రామవరం పశు వైద్యులు డాక్టర్ ఆనందరావు, సంబంధిత శాఖల అధికారులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గ్రామస్తులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :