Tuesday, 28 July 2026 03:02:05 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జిల్లాస్థాయి ఆసుపత్రుల ప్రగతి పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 03 March 2025 06:56 PM Views : 1301

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జిల్లాలోని ఆసుపత్రుల ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిల లో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, స్కానింగ్, రక్త పరీక్షలు, సర్జరీలు డయాలసిస్ మరియు డెలివరీ లపై ఆస్పత్రులు వారీగా ప్రగతిపై ఆసుపత్రుల సూపర్డెంట్ లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ఆసుపత్రులలో పారిశుధ్యం కొరకు అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రులలో ఈ ఎన్ టీ వైద్యం కోసం కావలసిన యంత్ర పరికరాలకు సంబంధించి నివేదికలు అందించాలన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వర్షాకాలంలో ఆసుపత్రుల్లో ఎక్కడైనా లీకేజీ, త్రాగునీటి సమస్య వంటి వాటిని గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో అవసరమైన వైద్యులు మరియు సిబ్బందిని నియామకానికి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రిలో అభివృద్ధి కొరకు సింగరేణి, ఐ టి సి, కేటీపీఎస్ యు నవభారత్ వంటి పరిశ్రమలు ముందుకొస్తున్నాయని, దానికి తగిన విధంగా సరైన ప్రణాళికలు రూపొందించాలని సూపర్డెంట్ లను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మరియు సిబ్బంది సమయపాలన పాటించి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.సిబ్బంది హాజరు పై ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు . నర్సింగ్ సూపర్డెంట్లు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సిబ్బందికి డ్యూటీలు వేయాలని అన్నారు. ఆసుపత్రులలో సరిపడా మందులు లేవంటే ఆసుపత్రి ఫార్మసిస్టులు దే బాధ్యత అని అన్నారు. అవసరమైన మందులకు ఎప్పటికప్పుడు ఇండెంట్లు పంపించాలని సూచించారు.ఇండెంట్లు పెట్టిన మందులు రాకపోతే తమ దృష్టికి తీసుకు రావాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచి డెలివరీ ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా చర్యలు చేపట్టాలి.ప్రభుత్వ ఆసుపత్రి కివచ్చే పేద రోగుల కు అందించే వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సందర్బంగా అన్ని విభాగలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపడెంట్ లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :