తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములును వారి నివాసంలో తెలంగాణ రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షులు కూరకుల నాగభూషణం ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ కోసం నాగ సీతారాములు చేసిన కృషిని పరిగణలో తీసుకొని రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తే యాదవ సామాజిక వర్గానికి సముచిత గౌరవం ఇచ్చినట్లు ఉంటుందని ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ