తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన సోబ్బని సూర్యం కుమారుడు అనారోగ్యం కారణం చేత ఆస్పటల్ లో వున్న వెంకన్న కు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఆపన్న హస్తం అందిస్తున్న స్వగ్రామం కాకర్ల గ్రామస్తులు. చిన్నచిన్న గ్రామాలే కులమని, మతమని ఎవరి దారిన వారు పోతున్న ఈ రోజుల్లో ఎవరికైనా సమస్య వచ్చిందంటే కులం, మతం తారతమ్యం లేకుండా ఎవరికి తోచిన సహాయం వారు చేస్తుంటారు. మండలంలోని పెద్ద గ్రామాలలో రెండవది అయిన కాకర్ల గ్రామ ప్రజలను చూసిన చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు గ్రామ ఐక్యతను గూర్చి గొప్పగా చెప్పుకుంటారు. సోబ్బని వెంకన్న బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకుకొని చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో ఒకసారి ఆపరేషన్ ద్వారా ప్రయోజనం పొందాడు. దీంతో మరోసారి ఆపరేషన్ చేయించాల్సి రావడంతో ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. గతంలో లక్షలు వెచ్చించి ఆపరేషన్ చేయించుకుని నిత్యం మందులతో జీవనం సాగిస్తున్న యువకుడు ఉన్నవన్నీ అమ్మేసుకుని చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం తన కుమారుడి వైద్యం కోసం లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు పేర్కొనడంతో విషయం తెలుసుకున్న సూర్యం కలత చెంది అందిన కాడికి అప్పులు చేసి లక్షల ఖర్చులు భరించ లేక లేబోదిబోమంటూ దయార్థపృదుల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం యువకుడి కి హైదరాబాదులోని కిమ్స్ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించారు. నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు ప్రాణాలు కాపాడేందుకు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇప్పటివరకు 50 వేల రూపాయలు సహాయం చేయగా వెంకన్న తో పాటు చదువుకున్న తోటి విద్యార్థులు స్నేహితుడి కోసం 28 వేల రూపాయలు సహాయంగా ఇచ్చారు. తన కుమారుడి ఆస్పటల్ ఖర్చుల నిమిత్తం సహాయం చేసి న వారందరికీ సోబ్బుని సూర్యం కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా సహాయం చేయదలచిన వారు ఈ సెల్ నెంబర్ సంప్రదించవలసిందిగా కోరారు 8328351070
Admin
తెలుగు వెలుగు టీవీ