Tuesday, 28 July 2026 12:42:32 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఘనంగా కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవం పాల్గొన్న పాలక మండలి సభ్యులు, త్రివేణి - కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీశ్

Date : 09 July 2025 09:04 AM Views : 793

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం జులై 8: కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం సోమవారం ఉదయం యూనివర్సిటీ లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హాజరయ్యారు. పి హెచ్ డి అవార్డులు పొందిన అభ్యర్థులకు డాక్టరేట్ పట్టాలు, వివిధ కోర్సుల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన వారికి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులతో సమావేశం అయ్యారు. పాలక మండలి సభ్యులతో గవర్నర్ గ్రూప్ ఫోటో దిగారు. కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా ఉన్న కొత్తగూడెం లోని త్రివేణి - కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్, కృష్ణవేణి డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గొల్లపూడి జగదీశ్ కూడా గవర్నర్ తో పాటు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యా రంగంలో సుధీర్ఘ అనుభవం ఉన్న జగదీశ్ కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులుగా ఉంటూ యూనివర్సిటీ కి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడంలో పాలక మండలి సభ్యులతో పాలు పంచుకుంటున్నారు. సోమవారం నాటి పాలక మండలి సమావేశంలో గవర్నర్ తో పాల్గొనే అవకాశం రావడం పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా కు చెందిన పలువురు విద్యాభిమానులు గొల్లపూడి జగదీశ్ కి అభినందనలు తెలియజేశారు. విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉండాలనే ఉద్దేశ్యంతోనే తన సలహా సూచనలు ఉంటాయని ఈ సందర్భంగా జగదీశ్ అన్నారు. ఈ స్నాతకోత్సవంలో కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా త్రివేణి - కృష్ణవేణి విద్యా సంస్థల డైరెక్టర్లు మాచవరపు కోటేశ్వరరావు, గొల్లపూడి వీరేంద్ర చౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు జగదీశ్ కి అభినందనలు తెలియజేశారు. మున్ముందు మరిన్నో ఉన్నత పదవులను అలంకరించి విద్యా రంగంలో తన సేవలను ఉపయోగించాలని ఆకాంక్షించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :