తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీత్లా పండుగ శుభాకాంక్షలు లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయకుడు మాట్లాడుతూ... సీత్లా పండుగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, వచ్చే ఏడాది నుండి సెలవు దినంగా ప్రకటించాలి. సీతంపేట బంజారా సర్పంచ్ గూగులోతు జానకిరామ్ నాయక్. లావుడియా గోపి నాయక్. గ్రామ నాయకులు చందర్ నాయక్. భూక్య హథిరాం నాయక్. మాట్లాడుతూ గిరిజన లంబాడిలు తరతరాలుగా ఆనవాయితీగా జరుపుకునే తొలి పండుగ అయిన “సీత్లా పండుగ” నందు తండాలలో గడప గడప నుండి ప్రత్యేక నైవేద్యం తయారు చేసి 7 గురు అక్కా చెల్లెళ్ళు అయినటువంటి సీత్లా భవాని, మారమ్మ భవాని, తుల్జా భవాని, హింగ్లా భవాని, కేంఖాలి భవాని, మంత్రాలి భవాని, ద్వాలంగర్ భవాని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జూలై నెల మొదటి మంగళవారం రోజుననే ఈ పండుగను చేసుకోవడం జరుగుతుంది. ఈ పండుగ ప్రధాన ఉద్దేశ్యం ఏమనగా, మా గిరిజన బంజారా లంబాడి జాతి వారికి మా తండాలలో వర్షాలు ఎక్కువగా కురిసి పంటలు బాగా సమృద్ధిగా పండాలని, పశువులు మరియు గ్రామ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తాము. అందువలన మాకు అందరికీ మంచి జరుగుతుందని భావిస్తాము. ఈ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, సెలవు దినంగా ప్రకటించాలి. ఈ పూజా కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు భూక్య ప్రతాప్ సింగ్. మాత్రు నాయక్. రమేష్ నాయక్. రవి నాయక్. NTR కృష్ణ. రాంప్రసాద్ నాయక్ . ప్రకాష్ నాయక్. కర్ణ నాయక్.భీమా నాయక్. రాములు నాయక్. రాంసింగ్ నాయక్.సాయి మణికంఠ.. సాయికుమార్.
Admin
తెలుగు వెలుగు టీవీ