Tuesday, 28 July 2026 02:32:27 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అత్యవసరం. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ. వి.సుబ్బారావు

Date : 20 September 2025 08:40 PM Views : 358

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రాథమిక విద్యలో పూర్వ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టడం అత్యంత ఆవశ్యకమని దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐ వి సుబ్బారావు అన్నారు. ఈరోజు ఉదయం బూర్గంపాడు మండలంలోని నాగినేని ప్రోలు ప్రాథమిక పాఠశాలలో ఉన్న అంగన్వాడీ పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి పరిశీలించి అక్కడి పిల్లలతో మాట్లాడారు. అనంతరం అంగన్వాడి కార్యకలాపాల గురించి అక్కడే అంగన్వాడీ టీచర్ మరియు స్థానిక సూపర్వైజర్ తో మాట్లాడి తెలుసుకున్నారు. పిల్లలకు అందించే వివిధ రకాలైన పోషక పదార్థాలు అదేవిధంగా తల్లులకు అందించే పోషక ఆహారం గురించి తెలుసుకున్నారు. పాఠశాల ఆకర్షణీయంగా తీర్చిదిద్దటం పట్ల అక్కడి అంగన్వాడి కేంద్ర సిబ్బందిని ప్రశంసించారు. అనంతరం అదే పాఠశాలలోని కృత్రిమ మేధ ద్వారా ఎఫ్ ఎల్ ఎన్ అభివృద్ధి కార్యక్రమాన్ని పరిశీలించి ఈ కార్యక్రమం పిల్లలు అభ్యసన మెరుగుపరచుకోవటానికి గొప్ప అవకాశం అని దీనిని సమర్థవంతంగా వినియోగించి అన్ని పాఠశాలల్లో అమలయ్యేటట్లుగా చూడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఐఏఎస్ అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ విద్యాచందన, జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు నాగ రాజశేఖర్, సతీష్ కుమార్, సైదులు, మండల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడెంలోని సింగరేణి గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా అభివృద్ధి అధికారి, సిడిపిఓలు, ఇండస్ట్రియల్ అధికారులతో, సమావేశం నిర్వహించిన ఆయన పూర్వ ప్రాథమిక విద్యను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయటం పట్ల అందరీ అభిప్రాయాలను తెలుసుకున్నారు. అంతేగాక విద్యావ్యవస్థ పటిష్టవంతంగా నడవడానికి కావలసిన సూచనలు సలహాలను కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి నాగలక్ష్మి, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ నాగరాజు శేఖర్, వివిధ మండలాల మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా, సిడిపిఓలు, జిల్లా పారిశ్రామిక అభివృద్ధి అధికారి పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :