తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి భారీ సంఖ్యలో హలో లంబాడీ చలో హైద్రాబాద్ కార్యక్రమానికి వెళ్లిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సేవాలాల్ బంజారా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం నుండి గుర్తింపు హైదరాబాద్ సంస్థానం పాలనలో లంబాడీలు సుగాలిలు ఇతర గిరిజన తెగలేన గోండ్ కోయ చెంచులతో పాటు గిరిజన జాబితాలో ఉన్నారు. దీనికి సంబంధించిన పక్క చరిత్రక ఆధారాలు ఉన్నాయి. లంబాడీల గిరిజన హోదా కొత్తగా వచ్చింది కాదు అది చరిత్రక వారసత్వం. చట్టబద్ధమైన పరిష్కారం లంబాడీలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి పార్లమెంట్ ద్వారా చట్టం చేసి 1977లో వారిని తిరిగి గిరిజన జాబితాలో చేర్చారు ఇది ఒక చట్టబద్ధమైన నిర్ణయం. ఈ హోదాను ప్రశ్నించడం భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ నిర్ణయనీ ప్రశ్నించడం అవుతుంది. నిజం పాలనలో హింస నిజాం పాలనలోనూ రాజాకార్ల చేతుల్లో బంజారాలో హింసకు గురయ్యారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానంలో గిరిజనులుగా గుర్తించబడిన తెలంగాణ లంబాడీలు 1952లో జరిగిన ప్రభుత్వం తప్పిదం వల్లే గిరిజనులు జాబితా నుంచి తొలగించబడ్డారు ఇది వారికి ఒక పెద్ద శాపంగా మారింది సుమారు 20 సంవత్సరాల పాటు వారు డినోటిఫైడ్ ట్రైబ్స్ ( *DNT ) మరియు వెనుకబడిన తరగతులు 'Bc' గిరిజన హక్కులకు దూరమయ్యారు. భారత గోర్ బంజారాలను దొంగలుగా చిత్రీకరించడం, గిరిజనులను కాదని చెప్పడం తెలంగాణలోని లంబాడీలు వలస వాదులని ఆరోపించడం. వారి జనాభా గాణాంకాలు అవాస్తవమని పేరొకనడం వేనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉంది ఈ విమర్శలు లంబాడీల చరిత్ర, సంస్కృతి జీవన విధానంపై సరైన అవగాహన లేకపోవడానికి స్పష్టంగా వస్తున్నాయి. నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం గిరిజనులుగా గుర్తించబడటానికి ఉన్న బోర్ బంజారాలకు ఉన్నాయి అయన తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జేఏసీ నాయకులు, మూడు రమేష్ నాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, గుగులోత్ కేశవ్ నాయక్, గుగులోత్ మని కంఠ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ