తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నారంవారిగూడెం పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వద్ద బొగ్గు లోడ్ తో వెళ్తున్న లారీని డీసీఎం ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన డీసీఎంను జేసీబీ సహాయంతో తొలగించారు
Admin
తెలుగు వెలుగు టీవీ