తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అన్నపురెడ్డిపల్లి మండలామ్ పరిధిలోని రాజాపురంలో మే డే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రాణ త్యాగాలతో సాధించుకున్న హక్కులను కాపాడుకోవాలని, కార్మికుల శ్రమను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అనంతరం జెండా ఆవిష్కరించి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని మేడే శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత రంగ కార్మికులు, కర్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ