తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 02(తెలుగు వెలుగు) : సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని, కలెక్టర్ జితేష్ వీ పాటిల్. పాల్గొన్న రెజ్లింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు,టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు . జిల్లా క్రీడశాఖ ఆధ్వర్యంలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ లు ప్రారంభమయ్యాయి. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఎమ్మెల్యే కూనంనేని.సాంబశివరావు,కలెక్టర్ జితేష్ వీ పాటిల్ ప్రారంభించగా, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలో క్రీడాకారుల కోసం కలెక్టర్ చేస్తున్న కృషి మర్చిపోలేమని, ఈ సమ్మర్ క్యాంప్ లను ఉపయోగించుకొని క్రీడాకారులు మరింత మెరుగవ్వాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని జిల్లాకు పేరు తేవాలని అన్నారు. గతంలో 14 క్యాంపులు ఉండగా ఈసారి 35 క్యాంప్ లు ఏర్పాటు చేసిన కలెక్టర్, ఎమ్మెల్యే లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎం ఎస్ చైర్మన్ కొత్వాల.శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, డీవైఎస్ఓఎం పరంధామరెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అధ్యక్షులు యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు వై వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, పలువురు కోచ్ లు, అధికారులు, అనధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు..
Admin
తెలుగు వెలుగు టీవీ