Tuesday, 28 July 2026 03:01:22 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

రూ.2.76కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన : కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు

Date : 18 June 2026 05:46 PM Views : 272

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆధునికీకరణతో రాతిచెరువు రూపురేఖలు మారుతాయి. ✍️ రూ.2.30కోట్లతో రాతి చెరువు అభివృద్ధిపనులు చేపడుతున్నాం. ✍️ అభివృద్ధికి చిరునామాగా పాల్వంచను తీర్చిదిద్దుతాం. ✍️ నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు. ✍️ ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా నిరంతర కృషి. ✍️ నిర్ణీత కాలంలోగా నాణ్యతతో పనులు ముగించేలా చర్యలు తీసుకుంటాం. ✍️ ప్రతిపల్లెకు, బస్తీకి మౌలిక వసతులు కల్పిస్తాం. ???? కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. రూ.2.30కోట్ల నిధులతో చేపట్టనున్న రాతిచెరువు ఆధునికరణతో చెరువు రూపురేఖలు మారుతాయని, రాతి చెరువు పరిసరాలు ఎంతగానో ఆహ్లాదంగా మారుతాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలో రూ.2.30 కోట్లతో చేపట్టనున్న రాతి చెరువు అభివృద్ధి పనులకు, అలాగే రూ.76 లక్షల నిధులతో నిర్మించనున్న రెండు నూతన రోడ్ల నిర్మాణ పనులకు గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ... రూ.2.30 కోట్లతో రాతి చెరువు సుందరీకరణ పనులు, వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణం, ఇతర ఆధునీకరణ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. అభివృద్ధికి చిరునామాగా పాల్వంచను తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలో ముమ్మరంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయని వివరించారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా తాము నిరంతర కృషి చేస్తున్నామని, నియోజకవర్గ పరిధిలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరిన్ని నిధులు తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఈ పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా, పూర్తి నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత కాలవ్యవధిలోగా పనులు ముగించేలా చర్యలు తీసుకుంటామని, ఆ మేరకు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రతిపల్లెకు, బస్తీకి మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, తహసిల్దార్ దారా ప్రసాద్, ఇంచార్జీ కమిషనర్ విజయానంద్ ఎలక్ట్రికల్ Ade అబ్దుల్ రెహమాన్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు గుర్రం వెంకటేశ్వర్లు నామ కీర్తి గొర్లె అన్నపూర్ణ, కాల్వ భాస్కర్, దున్నపోతుల మణి, దంతబోయిన నరేష్, నాయకులు వీ పద్మజ, డి సుధాకర్, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, శెనగారపు శ్రీనివాసరావు, SA రెహమాన్, ys గిరి, గౌస్ పాషా, మస్తాన్, అహ్మద్ జానీ, కరీం, గొర్లె నరేష్, నామ పండు, ఆలపాటి ప్రసాద్, అల్లి వెంకటేశ్వర్లు వివిధ శాఖల డి ఈ లు ఏఈలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :