తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం: పలు ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూళ్లను నియంత్రించాలని అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను అమ్ముతున్న వారిపై చర్యలు చేపట్టాలని, ఫహీమ్ డిమాండ్ చేసారు అనంతరం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లలకు మంచి విద్య అందించాలని ఆలోచన ఉంటుందని దీన్నే అదునుగా చేసుకొని వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఒక నియంతలా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతి ఏటా విద్యార్థి సంఘాలు ఈ సమస్యలు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నప్పటికీ వారి నిర్లక్ష్యం మూలాన హద్దు అదుపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు ఈరోజు నియంతల వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయం పై ఆలోచన చేసి, ప్రతి ఏటా ఇష్టారాజ్యంగా పెంచుతున్న ప్రైవేటు పాఠశాలల ఫీజులపై నియంత్రణ చట్టం తీసుకురావాలని, ప్రతి ప్రైవేటు పాఠశాలలో 25% ఉచిత విద్యను పేద విద్యార్థులకు అందించాలని అదేవిధంగా బుక్ స్టాల్స్ లో సైతం 25 రూపాయలు ఖరీదు చేసే పాఠ్యపుస్తకాన్ని వందల్లో అమ్ముతున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలు మరియు బుక్ స్టాల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో అన్ని సంఘాలను ఏకం చేసుకుని ఉద్యమాన్ని నిర్మించక తప్పదని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు..ఈ కార్యక్రమంలోఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అజీత్, వంశీ, రానదీర్, వినయ్, సృజన్ తదితరుల పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ