Tuesday, 28 July 2026 02:16:09 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఏకలవ్య పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 22 July 2026 06:26 PM Views : 50

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సేవలు, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కమిటీ (డీఎల్‌సీ) సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో టేకులపల్లి, ములకలపల్లి, దుమ్ముగూడెం, గండుగులపల్లి, గుండాల, చర్ల, పాల్వంచ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, విద్యా ప్రమాణాల మెరుగుదల, తాగునీటి సౌకర్యం, క్రీడా మైదానాలు, డిజిటల్ సదుపాయాలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు సికిల్ సెల్ పరీక్షలు, వార్షిక ఆరోగ్య పరీక్షలు, ప్రత కంటి పరీక్షల శిబిరాలు తప్పనిసరిగా నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్ క్యాలెండర్ రూపొందించి, దాని ప్రకారం పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఏకలవ్య పాఠశాలలో పార్ట్ టైం డాక్టర్ ను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండేలా జిల్లాలోని అన్ని ఏకలవ్య పాఠశాలల్లో ఆర్‌ఓ సిస్టమ్‌తో కూడిన వాటర్ కూలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దుమ్ముగూడెం, చర్ల ఏకలవ్య పాఠశాలలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కనెక్షన్ కల్పించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధితో పాటు క్రమం తప్పకుండా క్రీడా పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని, పనులు చేపట్టేలా ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. పాఠశాల విస్తరణకు అవసరమైన అదనపు భూమి అంశాన్ని కూడా సంబంధిత శాఖలతో సమన్వయం చేసి పరిశీలించాలని సూచించారు. అన్ని ఏకలవ్య పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, కంప్యూటర్ ల్యాబ్‌లను ఆధునికీకరించాలని, అవసరమైన కంప్యూటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం అందించడం అత్యంత ముఖ్యమని , కొన్ని పాఠశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో నిర్ణీత మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని , ఇకపై అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు అల్పాహారంలో చపాతీలు అందించేందుకు అవసరమైన చోట చపాతీ మేకింగ్ యంత్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచాలని, మొక్కల పెంపకం కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని అన్నారు. తల్లిదండ్రుల కోసం వేచి ఉండే షెడ్లు, అతిథి గృహాలకు అవసరమైన సౌకర్యాలు, పాఠశాల మైదానాల అభివృద్ధి, విద్యుత్ సరఫరా మెరుగుదల, అంతర్గత రహదారుల నిర్మాణం, భద్రతా చర్యల బలోపేతం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలవాలని, వారికి నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం, భద్రత, ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సూచించారు.ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ ఆర్ సి ఓ అరుణకుమారి, భద్రాచలం పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ పాఠశాల ప్రిన్సిపల్, ఏకలవ్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :