తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జులై 10 (తెలుగు వెలుగు) : జూలూరుపాడుమండలం, వెంగన్నపాలెం, దత్త నగర్ లో కొలువుదీరి ఉన్న... శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తమ గురువుల ఆశీస్సులు పొందుతున్నారు. కొందరు భక్తులు దీక్షలు చేపట్టి, గురు చరిత్ర పారాయణాలు చేస్తున్నారు. గురు పౌర్ణమి పవిత్ర దినం గురువులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు, వారి బోధనలను స్మరించుకునేందుకు ఉద్దేశించినదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున గురువులను సేవించడం వల్ల జ్ఞానం, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉదయాన్నే కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి దంపతులు.సాయి బాబాను దర్శించుకున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ