Tuesday, 28 July 2026 12:09:38 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

తండ్రి కష్టాన్ని చూసి పెరిగిన బిడ్డలు

Date : 20 December 2025 02:16 PM Views : 1134

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తండ్రి కష్టాన్ని చూసి పెరిగిన ఆ బిడ్డలు, ఆయన పడ్డ శ్రమకు సార్థకత చేకూరుస్తున్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చినప్పటికీ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చుంచుపల్లి మండలం ఎన్‌కే నగర్ భాధావత్ తండా గ్రామానికి చెందిన,భూక్యా రవి, సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తు , టీజీపీఎస్సీ (TGPSC) ఫలితాల్లో సీనియర్ ఆడిటర్ ఉద్యోగాన్ని సాధించి తన సత్తా చాటారు. తండ్రి కష్టమే వారి విజయానికి పునాది రవి తండ్రి భూక్యా జగన్ తన పిల్లల చదువు కోసం ఎంతో కష్టపడ్డారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో కూడా పిల్లల విద్య విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. తన పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన పడ్డ తపన నేడు ఫలించింది. ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నతాధికారులు జగన్ ఇద్దరు కుమారులు ప్రస్తుతం ఉన్నత హోదాల్లో ఉండి తండ్రి పేరు నిలబెడుతున్నారు. పెద్ద కుమారుడు రవి ప్రస్తుతం సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2గా పని చేస్తూనే, పట్టుదలతో చదివి ఇప్పుడు టీజీపీఎస్సీ సీనియర్ ఆడిటర్‌గా ఎంపికయ్యారు. తమ్ముడు భరత్ కుమార్ , ఇప్పటికే సింగరేణి సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియర్ ఆడిటర్‌గా విజయం సాధించినప్పటికీ, రవి అసలు లక్ష్యం సివిల్ సర్వీసెస్.అత్యున్నత పదవులను చేపట్టడమే ధ్యేయంగా ఆయన తన ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, తన విజయానికి తండ్రి జగన్, తల్లి చంద్రకళ, భార్య శ్రీ కవిత, తమ్ముడు భరత్ కుమార్,మరదలు సంధ్య కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు అందించిన ప్రోత్సాహమే కారణమని కృతజ్ఞతలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :