తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్ కేంద్రంలో శనివారం సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ విలేకర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సేవాలాల్ బంజారా సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా సేవాలాల్ బంజారా సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతిలాల్ హాజరై మాట్లాడారు. ఏవేవో హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలల కాలం గడుస్తున్న లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రెడ్డి రాజ్యంలో లంబాడీలకు సముచిత స్థానం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని లంబాడి సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం వేదికగా రెడ్డి రాజ్యంపై లంబడోళ్ళ లడాయి షురూ చేస్తామని చెప్పారు. త్వరలో కొత్తగూడెంలో వేలాది మందితో బహిరంగ సభ, ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఏజెన్సీ జిల్లాలో ఏజెన్సీ చట్టాలపై సామాన్య గిరిజనుడు ప్రశ్నిస్తే అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్ళకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను తిప్పి కొడతామని అన్నారు. బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్లో ఓ గిరిజనుడి ఇంటి ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ అక్కడ కొంతమంది దాడులకు దిగుతున్నారని చెప్పారు. అంబేద్కర్ మహానుభావుడి విగ్రహ ఏర్పాటుకు కులాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని తెలిపారు. అలాగే కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు పేరుతో గిరిజన తండాల పేద ప్రజలకు ఉపాధి హామీ పథకం లేకుండా చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే పోడు భూములపై మొదటి సంతకం చేస్తామని చెప్పిన హామీ ఏమైందని దేవా చేశారు. జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో అగ్గిపుట్టిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నందిని భాయ్, రాష్ట్ర నాయకులు లావుడియా సత్యనారాయణ నాయక్, రాష్ట్ర కోశాధికారి తేజావత్ రవికుమార్ నాయక్, రాష్ట్ర విద్యార్థి భాగం బోడ శ్రీనివాస నాయక్, రాష్ట్ర కార్యదర్శి బట్టు వీరన్న నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ నాయక్, జిల్లా కార్యదర్శి ధరావత్ నాగరాజు నాయక్, చండ్రుగొండ మండల అధ్యక్షుడు దేవిలాల్ నాయక్, నాయకులు సీతారాం నాయక్ శంకర్ నాయక్, పురి సింగ్ నాయక్ కృష్ణమూర్తి నాయక్, రేవంత్ నాయక్, సాగర్, శిరీష భాయ్, సురేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ