Tuesday, 28 July 2026 03:27:24 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ విద్యాచందన

Date : 28 January 2026 06:49 PM Views : 225

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించడంలో జోనల్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లోని ఐడిఓసి మీటింగ్ హాల్‌లో బుధవారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు (FST), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు (SST), జోనల్ అధికారులు మరియు అకౌంటింగ్ టీమ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి జోన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, ఎన్నికల సిబ్బంది నియామకం, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు చేపట్టి శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత జోనల్ అధికారులదేనని స్పష్టం చేశారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఫిర్యాదులు అందిన వెంటనే తక్షణ స్పందన అందించాలని సూచించారు. స్పష్టమైన ఆధారాలు (ఎవిడెన్స్) సేకరించిన అనంతరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నందున అధికారులు అత్యంత అప్రమత్తతతో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఉల్లంఘనలకు సంబంధించి ఏ అంశానికి ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలో పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ, మద్యం స్వాధీనం (లిక్కర్ సీజ్‌యూర్) జరిగిన సందర్భాల్లో తప్పనిసరిగా వాటిని ఎక్సైజ్ శాఖకు అప్పగించాల్సి ఉంటుందని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత ప్రదేశానికి చేరుకుని స్పాట్ వెరిఫికేషన్ నిర్వహించి, మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో FST బృందాలు SST బృందాలకు మార్గదర్శకత్వం అందించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదు లేదా ఎఫ్‌ఐఆర్‌ను 24 గంటల్లోపు సంబంధిత న్యాయస్థానంలో సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మహిళల హ్యాండ్‌బ్యాగ్‌ల తనిఖీని మహిళా అధికారులు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా, ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు మరియు అకౌంటింగ్ టీమ్ సభ్యులు తమ తమ విధులు, బాధ్యతలు మరియు అనుసరించాల్సిన విధివిధానాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు అడిగిన సందేహాలకు మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ స్పష్టమైన వివరణ ఇచ్చి నివృత్తి చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుధీర్, రాజశేఖర్, ఎంపీడీవోలు శ్రీనివాస్, సునీల్ తదితర అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :