Tuesday, 28 July 2026 11:02:19 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

గేద, ఆవు పాల కంటే మేక పాలు శ్రేష్టం - జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

Date : 14 July 2025 06:06 PM Views : 826

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గేద, ఆవు పాల కంటే మేకపాలు ఎంతో శ్రేష్టమైనవి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ నందు మహిళా శక్తి క్యాంటీన్ లో మేకపాల విక్రయ స్టాల్ ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులతో ముచ్చటించి మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా వారు విక్రయిస్తున్న ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం వారు ఇచ్చిన మేకపాలను త్రాగారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల కు వెళ్లే విద్యార్థులకు తప్పనిసరిగా మేకపాలు త్రాగించాలని ఇవి ఎంతో శ్రేష్టమైనవి మరియు స్వచ్ఛమైనవి అని అన్నారు. జిల్లావ్యాప్తంగా రెండు లక్షల మేకలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లో గేద, ఆవు పాలు లీటర్ 80 రూపాయల వరకు ధర ఉన్నదని అదే ధరకు మేకపాలు కూడా విక్రయించవచ్చని ఇవి ఎంతో ఆరోగ్యకరమని తెలిపారు. జిల్లాలోని రైతులు ముందడుగు వేసి లీటర్ నుండి ప్రారంభించినప్పటికీ రైతులకు 3000 నుంచి 4000 రూపాయలు అదనపు ఆదాయం కూడా లభిస్తుంది అన్నారు. ఈ మేకపాలను విక్రయించడం ప్రారంభించడం ద్వారా జిల్లాలో సంవత్సరానికి 50 కోట్ల వ్యాపారానికి అవకాశం ఉందన్నారు. జిల్లాలో మేకల పెంపకానికి పశు గ్రాసానికి అనువైనది అన్నారు. నగరాల్లో మేకపాలతో పన్నీరు, చీజ్ వంటివి తయారుచేసి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని మన ప్రాంతంలో కూడా వీటిని వినియోగించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని రైతులు ఈ దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్లు ఆనందరావు, బాలకృష్ణ, రామకృష్ణ మరియు సంతోష్, గోపాలమిత్ర సత్యనారాయణ మరియు మహిళా శక్తి క్యాంటీన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :