తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 1 తెలుగు వెలుగు) వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ చిన్న కుమార్తె చందన కడప జిల్లాలో ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ కాలేజీలో మాబ్స్ పూర్తిచేసి గురువారం డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తన కుమార్తె MBBS డిగ్రీ పట్టాను అందుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆనందంగా ఉందని, తన కూతురు గ్రాడ్యుకేషన్ వేడుక కార్యక్రమంలో తాను కూడా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే తన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అడ పిల్లల్ని వైద్య వృత్తిలో, తన కొడుకునిఇంజనీరింగ్ లో చేర్పించడం జరిగిందన్నారు. తన పెద్ద కూతురు మాలోత్ గాయత్రి ఆయుర్వేదిక్ వైద్యంలో గ్రాడ్యుకేషన్ పూర్తి చేయగా, రెండో కూతురు చందన ఈ రోజు ఎంబిబిఎస్ పూర్తి చేసిందని, తన కుమారుడు మాలోత్ విఘ్నేష్ బీటెక్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. వారిని విద్యావంతులను చేయడంలో తన సతీమణి లలిత ఎంతో కృషి ఉందని, తాను రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఆమె ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని అన్నారు. తనతో పాటు తన పిల్లలకు కూడా వైరా నియోజకవర్గ ప్రజలకు సేవలందించేందుకు శక్తివంచన లేకుండా చేస్తాస్తారని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ