Tuesday, 28 July 2026 12:19:54 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ.

Date : 19 October 2024 08:00 PM Views : 527

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేసిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి మరియు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్,అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆది నారాయణ మరియు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు తో కలిసి పంపిణీ చేశారు. శనివారం ఇల్లందు క్రాస్ రోడ్ లోగల సింగరేణి గెస్ట్ హౌస్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గౌడ్ అన్నలకు రక్షణ కవచాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంటు రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ గీత కార్మికుల రక్షణకు ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాల కిట్లు గౌడ్ అన్నలకు ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. గౌడ్ అన్నలు తమ వృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కుతున్న క్రమంలో ఆకస్మికంగా జరిగే ప్రమాదాల వలన చాలామంది మరణానికి, శాశ్వత అంగవైకల్యానికి గురి అవుతున్న క్రమంలో వాటిని అరికట్టడానికి ప్రభుత్వం గౌడ్ అన్నల భద్రత కోసం ప్రత్యేక దృష్టి సాధించి వారికోసం ప్రత్యేకంగా ఒక కిట్ తయారు చేయించి దానిని గౌడ్ అన్నల కులదైవం అయినటువంటి కాటమయ్య పేరు పెట్టి కాటమయ్య రక్షగా ఒక పథకం ద్వారా అందరికీ ఆ కిట్లను అందజేస్తుందన్నారు. దీనిలో భాగంగా గీత కార్మికులకు దశలవారుగా శిక్షణ ఇచ్చి, అందరికీ అందే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.

మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూరక్షక కవచం కిట్ల వల్ల కల్లు గీత కార్మికులు చెట్లపైకి వెళ్లినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని, వీటిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, దీనిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్లుగీత కార్మిక సొసైటీ పరిధిలోని చెట్లపైకి ఎక్కే గీత కార్మికులందరినీ గుర్తించి వారికి రక్షక కవచ కిట్లను అందజేస్తామని తెలిపారు. కాటమయ్య రక్షక కవచం కిట్లను అందజేసిన గీత కార్మికులు వాటిని వినియోగిస్తున్నారా లేదా చూడాలని, ఈ కిట్ల వినియోగం వల్ల కలిగే లాభాలను ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్షణ కవచాలు కంపెనీ కార్యక్రమం చేపట్టడంచాలా సంతోషం కరమని అన్నారు.జిల్లా లో ని రెండు పార్లమెంట్ నియోజకవర్గలా ఖమ్మం, భద్రాచలం పరిధిలో ఈరోజు 83 మందికి కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ చేపడుతున్నామన్నారు. గీత కార్మికులకు రక్షణ కోసంకోసం ప్రభుత్వం 12,000 ఖర్చు చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర, మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :