Tuesday, 28 July 2026 05:10:32 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పాఠశాలల సమీపంలోని చిరుతిండి దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 12 March 2026 08:53 PM Views : 197

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని బీసీ, ఎస్సీ, మైనారిటీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసి కార్యాలయంలో సంబంధిత జిల్లా అధికారులు, ఆహార భద్రత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇకపై కలుషిత ఆహార ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండేలా ప్రత్యేక కార్యాచరణతో నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ఆహారం కలుషితం కావడానికి గల కారణాలను ఆహార భద్రత అధికారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.పాఠశాలలు, వసతి గృహాల సమీప ప్రాంతాల్లో ఉన్న చిరు తిండ్ల దుకాణాలు, ఐస్‌క్రీమ్ బండ్లు మరియు ఇతర ఆహార విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. విక్రయించే ఆహార పదార్థాల గడువు తేదీలు, నాణ్యత, నిల్వ విధానాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. నాణ్యత లేని లేదా గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.పాఠశాలలకు బయట నుండి ఆహార పదార్థాలు తీసుకురావడం అనుమతించరాదని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలల వంటగదులు, భోజనశాలలు పరిశుభ్రంగా ఉండేలా సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఓ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ సంక్షేమ అధికారి శ్రీలత, ఆహార భద్రత అధికారి శరత్, ఆర్‌సీఓలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :