Tuesday, 28 July 2026 05:54:11 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

అప్పుడు అధికారంలో ఉంది ఎవరు.నాడు అడ్డుపడ్డ వాళ్ళే నేడు నీతులు చెప్తున్నారు.పాత్రికేయ సోదరరులు అంతా గమనిస్తున్నారు : టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

Date : 26 March 2025 05:38 PM Views : 862

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత 10 ఏళ్ళు అధికారంలో ఉంది ఎవరో అందరికి తెలుసని, అవకాశం ఉన్నప్పుడు కావాలని ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వాళ్లు జర్నలిస్టులను సభ్యుసమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం వాళ్లకు హోదాకు తగదని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరూ జర్నలిస్టులకు ఒకే చోట ఇళ్ల స్థలం ఇచ్చే ఆలోచన చేస్తే జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలం ఇచ్చిన క్రెడిట్ ఆయనకు దక్కుతుందని కొందరు అడ్డుకున్న విషయం జర్నలిస్ట్ లు గుర్తు చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా అదంతా తన క్రెడిట్ అనే ఆలోచనతో నాడు విలేకరులకు తీవ్ర అన్యాయం చేశారని, సింగరేణి అధికారులతో మాట్లాడి వాళ్లకు ఇంటి స్థలం ఇప్పించే అవకాశం ఉన్నపటికీ అప్పుడు చప్పుడు చేయకుండా నేడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అప్పుడే సింగరేణి సంస్థతో మాట్లాడి నామమాత్రపు ధరకు జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇచ్చేలా కృషి చేసి ఉంటే నేడు జర్నలిస్టు మిత్రులు ఇలా నిరసన తెలిపే అవసరం రాకపోయేదని, ఆనాడు అధికారంలో ఉండి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే తాత్సారం చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్దిష్ట ప్రతిపాదనలు చేస్తూ ఎలాంటి అభ్యంతరాలు రాకుండా జర్నలిస్టులకు స్థలాలను ఇచ్చి జర్నలిస్ట్ లకు న్యాయం చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో జర్నలిస్టులకు ఇళ్లను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోయే రోజుల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. నిపుణుల సూచన మేరకు ముందుకెళ్దామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న మాటలను గుర్తు చేసిన ఆయన ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వస్తాయని స్పష్టం చేశారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ విలేకరులకు ఎం చేయకుండా నేడు విలేకరులు చేస్తున్న దీక్షల వద్ద కావాలనే ఇందిరమ్మ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటివాటిని జర్నలిస్ట్ మిత్రులు సభ్యసమాజం గమనిస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతిపాదనలు చేసి అర్హులైన అందరికి ఇళ్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కూడ ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్తానన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :