తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇల్లెందు క్రాస్ రోడ్ వద్ద ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న ఎస్సై రమణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి వేళ చీకట్లో సైతం చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఎస్సై రమణారెడ్డి సకాలంలో స్పందించి, ట్రాఫిక్ను క్లియర్ చేసినందుకు స్థానికులు ఆయనను అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ