తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వర్షాకాలంలో ప్రజలకు వచ్చే సీజనల్ వ్యాధుల భారీ న పడకుండా ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని పదో వార్డులోని అన్ని గల్లీలలో సైడ్ డ్రైనేజీలపై బ్లీచింగ్ పౌడర్ చెల్లించడం జరిగిందని, అది నా బాధ్యత అని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అన్నారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధు లైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి విష జ్వరాల తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దాని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో మున్సిపల్ అధికారులు స్పందించి బ్లీచింగ్ పౌడర్ పంపిణీ చేయడం జరిగింది ఆమె తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా సీజనల్ వ్యాధి నుండి రక్షణ పొందవచని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంగం సభ్యులు మార్తమ్మ ,వెంకటలక్ష్మి, రాజేశ్వరి ,శానిటేషన్ సిబ్బంది శాంత, స్వరూప, సందీప్ ,డ్రైవర్ బాబా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ