Tuesday, 28 July 2026 12:33:20 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Date : 21 November 2025 06:21 PM Views : 342

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్ల పురోగతిని శుక్రవారం పరిశీలించి, వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం ముఖ్యమంత్రి పర్యటనకు అనుగుణంగా తీర్చిదిద్దే పనుల్ని కలెక్టర్ విభాగాల వారీగా పరిశీలిస్తూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆడిటోరియం, హాస్టల్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లు, అంతర్గత రహదారుల మరమ్మత్తు, వంటి కీలక ప్రదేశాలను సందర్శించి, పనుల పురోగతిపై ఇంజనీరింగ్ మరియు యూనివర్సిటీ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రతీ పని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఆలస్యానికి కారణమయ్యే అంశాలు ఏవైనా ఉంటే వెంటనే నివేదించాలని, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. యూనివర్సిటీ మొత్తం పరిశుభ్రత మరియు పచ్చదన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రతి విభాగాన్ని అందంగా మార్చేందుకు ఎంపీడీవోలను ప్రత్యేక విభాగాలకు కలెక్టర్ నియమించారు. గ్రౌండ్ లెవెలింగ్, మొక్కలు నాటడం, రోడ్ల పక్కన హార్టికల్చర్ పనులు, చెత్త తొలగింపు వంటి సుందరీకరణ కార్యక్రమాలు తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన రోజున యూనివర్సిటీ ఒక ఆదర్శవంతమైన విద్యాసంస్థగా కనిపించాలనే లక్ష్యంతో పనుల్ని అమలు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఏలాంటి లోపాలు లేకుండా, ప్రణాళిక బద్ధంగా పని చేయాలన్న దిశగా విద్యుత్, నీటి వసతులు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మీడియా ఏర్పాట్లు, వసతి సదుపాయాలు వంటి అన్ని విభాగాలు పరస్పరం సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యటన విజయవంతం కావాలంటే ప్రతి శాఖ సమిష్టిగా పనిచేయాలని, అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ ప్రతిష్ఠకు తగ్గట్టుగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పరిపాలన పూర్తిస్థాయి సమన్వయంతో పని చేసి, సకాలంలో అన్ని పనులు పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిపిఓ అనూష, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాస్, ఎంపీడీవోలు కళాశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :