Tuesday, 28 July 2026 02:35:59 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కోల్ ఇండియా ఇంటర్ కబడ్డీ పోటీల ఫైనల్‌కు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య.

Date : 30 November 2025 08:05 PM Views : 226

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా వేదికగా విజేతగా నిలిచిన డబ్ల్యూసీఎల్, రన్నరప్‌గా సింగరేణి జట్లు.సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో, కొత్తగూడెం ఏరియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీల ఫైనల్ మ్యాచ్‌కు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ (ఎఐటియుసి) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఆయన తిలకించారు.ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ, క్రీడలు క్రీడాకారుల మానసిక, శారీరక దృఢత్వం కోసం తప్పనిసరి అని అన్నారు. ప్రతి సంవత్సరం క్రీడల నిర్వహణ పట్ల కోల్ ఇండియా కంపెనీలు క్రీడా క్యాలెండర్‌తో ముందుకు రావడం హర్షణీయం అని అన్నారు. గెలిచినా, ఓడినా స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ ఉంటే విజయం ఎప్పటికైనా సాధ్యమవుతుందని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు.క్రీడాకారులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలి: సీతారామయ్య డిమాండ్.అండర్‌గ్రౌండ్‌లో ఉద్యోగం కష్టంతో కూడుకున్న పని అని పేర్కొంటూ, క్రీడాకారులకు స్పోర్ట్స్ విషయంలో ఆట వరకు మాత్రమే రిలీఫ్ ఇవ్వడం వల్ల వారు రాణించే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోల్ ఇండియా మరియు సింగరేణి యాజమాన్యాలను డిమాండ్ చేశారు.గాయపడ్డ క్రీడాకారుడికి వేతనం చెల్లించడంలో ఆలస్యం వద్దు, ఈరోజు పోటీలో కబడ్డీ ఆడుతూ తీవ్రంగా గాయపడ్డ సింగరేణి టీం క్రీడాకారుడు కార్తీక్ ను తాను సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించడం జరిగిందని సీతారామయ్య తెలిపారు. గాయపడ్డ క్రీడాకారులకు వేతనం ఇవ్వడంలో ఆలస్యం చేయకుండా, త్వరితగతిన వేతనాలు చెల్లించాలని ఆయన యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.స్పోర్ట్స్ సూపర్వైజర్లను వెంటనే నియమించాలి.క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని సుమారు పదిహేను సంవత్సరాల క్రితం స్పోర్ట్స్ సూపర్వైజర్లను నియమించారని గుర్తు చేస్తూ, ఇప్పటికైనా స్పోర్ట్స్ సూపర్వైజర్లను నియమించి వారికి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.అనంతరం, హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో విజేతగా నిలిచిన డబ్ల్యూసీఎల్ (WCL) జట్టుకు, రన్నరప్‌గా నిలిచిన సింగరేణి జట్టుకు వాసిరెడ్డి సీతారామయ్య శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్, గట్టయ్య, క్రిస్టోఫర్, సుధాకర్,నరసింహారావు, హుమాయూన్, సందేబోయిన శ్రీనివాస్, మధు కృష్ణ, కమల్, ఏ.ఆర్.కె. ప్రసాద్, రాంబాబు, మండల రాజేశ్వరరావు, సాయి పవన్,తోట రాజు,మెంగన్ రవి, బన్ను వెంకటేశ్వర్లు,ప్రేమ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :