Tuesday, 28 July 2026 12:45:09 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

పార్టీ అభివృద్ధికి నిరంతరం కష్ట పడతా , గాంధీభవన్ లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ గా నియామక పత్రం అందుకున్న నాగా సీతారాములు..

Date : 25 June 2025 03:13 PM Views : 813

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : హైదరాబాద్ గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క ఇటీవల నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తనపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటానన్నారు. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుని సమిష్టిగా ముందుకు వెళ్తానని, కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి తానే నిదర్శనమన్నారు. స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుండి మొదలై మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఎన్నో ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు, అవమానాలు, అరెస్టులు, ఉద్యమాలు అన్ని చూసుకుంటా కేవలం పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం కోసం గత 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగిన తనకు గతంలో టీపీసీసీ మెంబెర్ గా ఇప్పుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ ఆశావాహుడిగా ఉండి తనకు టికెట్ దక్కనప్పటికి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నికల్లో పార్టీ లైన్ దాటకుండ ప్రచారం చేసిన వ్యక్తిత్వం తనదన్నారు. కష్టపడి పని చేస్తే అధిష్టానం గుర్తుంచి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ మహా వృక్షమని, ఆ నీడలో అందరం కలిసి సమిష్టిగా పని చేస్తామని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భాద్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, చైర్ పర్సన్ సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘు రాంరెడ్డి , రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి లకు నాగా సీతారాములు కృతజ్ఞతలు తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :