తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆగస్టు 18 తెలుగు వెలుగు ) : అశ్వరావుపేట నియోజకవర్గం,చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఆ ఇళ్లను సందర్శించి న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. తదనంతరం ముఖ్యమంత్రి ల్యాండ్ అయ్యే ఎలిప్యాడ్ స్థలాన్ని సందర్శించి పరిశీలించి అధికారులతో మాట్లాడి కొన్ని సూచనలు ఇచ్చి ఆ తర్వాత దామరచర్ల లోని ముఖ్యమంత్రి సభ స్థలాన్ని పరిశీలించినారు .. ఈ సందర్భంగా మంత్రి పొంగలేటి శ్రీనివాస రెడ్డి వెంట జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు అశ్వరావుపేట శాసనసభ్యులు జారేఆదినారాయణ,సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి,భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు,వైరా శాసనసభ్యులు మలోత్ రాందాస్ నాయక్ మరియు జిల్లా అధికారులు,మండల అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ