తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : లక్ష్మీదేవిపల్లి మండలంలోని బావోజి తండాలో నవంబర్ 5న నూతన శివాలయ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జగదాంబ ప్రజా సేవా సమితి సభ్యులు తెలిపారు. శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, మండపారాధన, కలశ స్థాపన వంటి పూజలు జరుగుతాయని చెప్పారు. పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్య క్రమానికి ప్రజలందరూ హాజరుకావాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ