తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : సుజాతనగర్ లో గల సింగభూపాలెం చెరువు కట్ట కుంగిన విషయo పై ఇరిగేషన్ అధికారులతో సంప్రదించి చెరువు కట్ట మరమ్మత్తులను వెంటనే ప్రారంభించాలని, చుట్టుపక్కల గ్రామాలలోని రైతులకు వ్యవసాయానికి నీరు విడుదల విషయంలో జాప్యం జరగకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు . అదేవిధంగా సింగభూపాలెం గ్రామపంచాయతీలో పలువురు కార్యకర్తలను కలిసి సభ్యత నమోదు గురించి వివరించి వారికి బిజెపి ప్రాథమిక సభ్యత్వాన్ని ఇప్పించడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో కొత్త అంజినాపురంలోని మేదరమట్ల కుటుంబ సభ్యులను పరామర్శించి వారి బాగోగులను తెలుసుకొని అక్కడే ఉన్నటువంటి డ్వాక్రా గ్రూపు మహిళలతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలను వాటి యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది. అనంతరం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక దేశంలో అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పినే లక్ష్యంగా స్కిల్ ఇండియా రూపుదిద్దుకుంటుందని తద్వారా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు అనంతరం రాఘవపురం గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త ఇంటికి వెళ్లి నవ దంపతులను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ టి నరేంద్రబాబు, పార్లమెంట్ కో కన్వీనర్ బుడగం రవి, జల్లా రపు శ్రీను,మండల అధ్యక్షుడు భూక్యా రాజేష్ నాయక్, గుగులోతు రమేష్ బాబు, కొల్లి నరేంద్రబాబు, బొడ్డు బుజ్జి, లక్ష్మీనారాయణ రెడ్డి, రాందాస్, మాన్సింగ్, హనుమ, భద్రు, శంకర్ యాదవ్, కూరపాటి రామారావు, సంగు రాజేష్, క్రాంతికుమార్, అనిల్, హేమంత్, మౌనీత్, శ్రీకాంత్, వెంకన్న, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ