తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలంలో కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏన్కూర్ మండలానికి చెందిన కొండేటి లలితకు సూరారం గ్రామానికి చెందిన వినోద్ తో వివాహమైంది. ఏడాదిగా కడుపునొప్పితో బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున పురుగుల మందు తాగింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
Admin
తెలుగు వెలుగు టీవీ