Tuesday, 28 July 2026 05:13:46 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఆయిల్ పామ్ సాగుపై అవగాహన మరియు సాగు ప్రోత్సాహక కార్యక్రమం

Date : 10 March 2026 02:20 PM Views : 189

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేదీ.10.03.2026 నాడు కొమ్ముగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ అవగాహన మరియు సాగు ప్రోత్సాహక కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో గుండాల మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన మరియు సాగు ప్రోత్సాహక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు రైతులకు ఆయిల్ పామ్ పంట ప్రాధాన్యత, సాగు విధానం, అధిక దిగుబడులు పొందే పద్ధతులు మరియు ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి వివరించారు. ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా రైతులు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందవచ్చని తెలిపారు. అలాగే మొక్కల నాటడం నుంచి పంట కోత వరకు పాటించాల్సిన పద్ధతులు, నీటి నిర్వహణ, ఎరువుల వినియోగం మరియు పంట సంరక్షణ గురించి రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఉన్న బొప్పాయి, అరటి, తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, పూలు, తైవాన్ జామ, నిమ్మ, కరివేపాకు, బోడ కాకర, తీగ చిక్కుడు, మునగ, నేరేడు, సీతాఫలం, డ్రాగన్ ప్రూట్, కోకో, వక్క, జాజికాయ తదితర పంటలను నూతన రకాలతో సాగుచేపట్టి ఎకరానికి నికరంగా లక్ష రూపాయల ఆదాయం పొందవచ్చును. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సందేహాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తరించి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో కొమ్ముగూడెం గ్రామ సర్పంచ్ శ్రీమతి కల్టి కృష్ణవేణి, జిల్లా ఉద్యాన & పట్టుపరిశ్రమ శాఖ అధికారి శ్రీ జంగ కిషోర్, ఉద్యాన అధికారి శ్రీ డి. దేవప్రసాద్ ఆయిల్ఫైడ్ ప్రతినిధి, శ్రీ ఎస్. శంకర్, వికాష్, ఉపేందర్, కోరమండల్ సంస్థ ఉద్యోగులు, ఉద్యానవన శాఖ సిబ్బంది, ఇతర శాఖల సంబంధిత అధికారులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :