తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వెంటనే పోడు రైతులకు హక్కులు ఇవ్వాలి, పోడు రైతులపై అటవీశాఖ అధికారుల దాడులు ఆపాలి, సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. భద్రాద్రి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్ పిలుపు, గిరిజన పోడు రైతులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం సరి కాదని సేవాలాల్ బంజారా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రబోడు పోడు రైతులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. గిరిజన మహిళలను చుట్టుముట్టి విచక్షణారహితంగా అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం దుర్మార్గం అన్నారు. కరపటి అరుణ, మల్లమ్మలను అటవీ శాఖ అధికారులు గాయపరిచారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసి మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టాన్ని కారేపల్లి అటవీ రేంజ్, సెక్షన్, బీట్ అధికారులు ఉల్లంఘించారని చెప్పారు. ఆదివాసీ మహిళలపై జరిగిన దాడిని తెలంగాణ సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ