Tuesday, 28 July 2026 03:17:58 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం ప్రగతి మైదానంలో 15 ఆగస్టు 79 వ స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 14 August 2025 08:40 PM Views : 721

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. కొత్తగూడెం ప్రగతి మైదానంలో రేపు జరగబోయే 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ నుండి కార్యక్రమం ముగిసే వరకు జరిగే అన్ని ఏర్పాట్లను సమగ్రంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం 9:30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో మార్చ్ పాస్ట్, స్వాతంత్ర్య సమరయోధుల సన్మానం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. వేదిక బ్యాక్‌డ్రాప్, పోలీసు సాయుధ దళాల మార్చ్ పాస్ట్, స్వాతంత్ర్య సమరయోధుల సన్మానం వంటి కార్యక్రమాల నిర్వహణ పగడ్బందీగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా, డి.ఆర్.డి.ఏ., డ్వామా, వ్యవసాయం, సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం, ఉద్యానవనం, సూక్ష్మ సేద్యం, తదితర శాఖలు ఏర్పాటు చేసే స్టాల్స్ ఆకర్షణీయంగా ప్రజలను ఆకట్టుకునేలా ఉండాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనలు, అధికారులకు మరియు విఐపీలకు గ్యాలరీలు, మంచినీటి వసతి, వాహన పార్కింగ్ వంటి సదుపాయాలు పకడ్బందీగా ఉండాలని, వర్షం వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, తాసిల్దార్ పుల్లయ్య మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :