తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న బీసీ లకు 42 శాతం బిల్లు కు ఎట్టకేలకు గవర్నర్ ఆమోద ముద్ర లభించింది. రిజర్వేషన్ల కోసం తాజాగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో, తెలంగాణలో 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గజెట్ జారీ కానుంది. ఇక, రిజర్వేషన్ల అంశం తేలటంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం అనేక వ్యూహాలు చేసింది. తాజాగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ