తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలి.త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ.కలిసిమెలిసి ఉంటూ మతసామరస్యాన్ని చాటాలి.గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే మైనార్టీ సోదరుల ఆలోచన ఆదర్శం.మైనార్టీలపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.అందరి శ్రేయస్సు కోరుతూ జరుపుకునే పండుగ ఇది.సమైక్యతతోనే దేశం మరింత ముందుకు సాగుతుంది.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని బోడగుట్ట ఏరియాలో ఉన్న ఈద్గాను ఆయన సందర్శించి, అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదర కుటుంబాలను కలిసి వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలని, అందరూ సోదరభావంతో మెలగాలని ఆకాంక్షించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని, సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మైనార్టీ సంఘం నాయకుడు కోరడం అత్యంత అభినందనీయమని, ఇది ముస్లింల ఉదార స్వభావానికి నిదర్శనమని శ్లాఘించారు. ఈ ప్రతిపాదనను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని, ఇలాంటి ఆలోచనలు సమాజంలో మతసామరస్యాన్ని మరింత పెంపొందిస్తాయని ఆయన స్పష్టం చేశారు. పండుగ రోజున అందరి శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి, మైనార్టీ సంఘాల నాయకులు నయీమ్ ఖురేషి, అబిద్ హుస్సేన్, అబ్దుల్ రబ్, అన్వార్ పాషా, యాసీన్, ఎండి యూసుఫ్, ఖమర్, ఫారూఖ్, అమీర్ ఖాద్రి, ఇస్మాయిల్, షకీల్, ఇమ్రాన్, జహీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ