Tuesday, 28 July 2026 11:19:24 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

జ్యువెలరీ షాప్ యజమానులు తమ దుకాణాలు మరియు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేసుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 13 August 2025 05:04 PM Views : 1250

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తమ వ్యాపార సముదాయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జ్యువెలరీ వ్యాపారస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఉన్న జ్యువెలరీ షాప్ యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని కొత్తగూడెం పట్టణంలోని IMA ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గల జ్యువెలరీ షాపుల యజమానులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వారికి పలు సూచనలు చేశారు.బంగారు నగల దుకాణాల యజమానులు వారి దుకాణాలలో మరియు పరిసర ప్రాంతాల్లో పకడ్బందీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని తెలిపారు.దొంగతనాలకు పాల్పడిన నిందితుల వద్ద నుండి ఆభరణాలను కొనుగోలు చేయకూడదని,ఎవరైనా దొంగసొత్తును కొనుగోలు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.వ్యాపారస్తులు దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి పోలీసు వారు సూచనలను పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బంగారు నగలు వ్యాపారస్తులు తమ దుకాణాల పరిసరాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.తమ తమ దుకాణాలలో పనిచేసే వ్యక్తుల గురించి,వారి ప్రవర్తన గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే వారిని పనిలో పెట్టుకోవాలని సూచించారు.తమ దుకాణాల చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారి కదలికలపై కూడా సరైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలను తమ దుకాణాలలో ఉంచవలసి వచ్చినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.తమ వ్యాపార సముదాయాల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకొని రాత్రి వేళల్లో గస్తీని పెంచుకోవాలన్నారు.ఇప్పటివరకు జిల్లాలో జరిగిన పలు దొంగతనాల కేసుల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా మరియు పోలీస్ శాఖ వినియోగిస్తున్న సాంకేతికతను ఆధారంగా నిందితులను పట్టుకొని బాధితులకు న్యాయం చేకూర్చడం జరిగిందని అన్నారు.దొంగతనాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పోలీసు వారికి సహకరించాలని కోరారు.అనంతరం ఈ సమావేశంలో పాల్గొన్న బంగారు నగల దుకాణాల యజమానుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపిఎస్,ఇల్లందు డిఎస్పి చంద్ర భాను,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,సీసిఎస్ సీఐ రమాకాంత్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, కొత్తగూడెం 2టౌన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, 1టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్,3టౌన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ మరియు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :