Tuesday, 28 July 2026 12:06:40 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ సమావేశంలో మాట్లాడిన కాపు కృష్ణ

Date : 17 September 2025 08:55 PM Views : 594

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గత సంవత్సరం లాగానే లెక్కలు, తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను తక్కువ చూపెట్టే ప్రయత్నం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు కొత్తగూడెం ఏరియా రామవరం టీబీజీకేఎస్ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తెలంగాణ సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4701కోట్లలో 33% ఇస్తామని ప్రకటన చేస్తూ2289 కోట్లను పక్కనపెట్టి 2412కోట్లను మాత్రమే పచ్చడం జరిగింది. 2412 కోట్లలో 33%పంచాగా 67%మరల సింగరేణి సంస్థ డెవలప్ మెంట్ కొరకే పక్కన పెట్టారు. ఈ లెక్కన చుస్తే 16.9%మాత్రమే పంచారు. గత 12సంవత్సరాలనుండి టీబీజీకేఎస్ రికేజీనైజ్ యూనియన్ ఉన్నప్పుడు 16%నుండి 32%వరకు నికర లాభం లో పంచడం జరిగింది. కానీ ఇప్పుడు తక్కువ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాజమాన్యం. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా యాజమాన్యం నడుచుకోవడం జరుగుతుందన్నారు. అందుకనే గత సంవత్సరం యొక్క ఆడిట్ షీట్ను ఇప్పటివరకు విడుదల చేయలేదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికెఎస్ ) నాయకులు ఆరోపించారు. ఈ సంఘం సమావేశం లో మాట్లాడుతూ, 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసి ఆరు నెలలు కావస్తున్న సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరానికి వచ్చిన వాస్తవ లాభాలను తెలియపరచకపోవడం దుర్మార్గమని, గతoలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ జరిగినప్పటికీ వాస్తవ లాభాలను తెలియపరచక పోవడం పలు అనుమానాలతో పాటు భారీ ఎత్తున కుట్ర జరుగుతుందని భావించవచ్చన్నారు. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లు క్రిందకు వచ్చే పరిశ్రమలు,ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఆర్థిక సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ పరిశ్రమ ఉత్పత్తి, ఉత్పాదకత ల లాభ నష్టాలను తెలియపరచాల్సి ఉంటుందని, కానీ సింగరేణిలో విచిత్రం ఏమిటంటే ఆరు నెలలు గడిచిన వాస్తవాలను ప్రకటించకపోవడం వింత ప్రక్రియగా మిగిలిపోయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వచ్చిన నికర లాభాలను ప్రకటించకుండానే సిఎస్ఆర్ డిఎంఎఫ్టి, నిధులను యాజమాన్యంరాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనలు పక్కన పెట్టి ప్రకటిస్తున్నదన్నారు. రెండు రోజులు క్రితంతెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల గాను *146.70 కోట్ల రూపాయలను సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అంతేకాకుండాసిఎస్ఆర్ నిధుల కింద సింగరేణికి సంబంధంలేని సివిల్ ప్రిపేర్ అభ్యర్థులకు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు కోట్లాది రూపాయలను నిబంధనలు విరుద్ధంగా ప్రకటించడం జరిగినదని, ఈ గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25) సుమారుగాఅక్షరాల 6400 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినట్టుగా తెలుస్తుంది కావున యాజమాన్యం వెంటనే ఈ వాస్తవ లాభాలు 6400 కోట్ల రూపాయలను ప్రకటించి నికర లాభాల నుంచి ఎటువంటి కటింగ్ లేకుండా 35 శాతం లాభాల వాటను వెంటనే ప్రకటించి సత్వరమేఉద్యోగులకు అందజేయాలని అలాగే దసరా సెలవు అక్టోబర్ రెండో తారీకు నుంఛి మూడో తారీకు కు మార్చాలని ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్రం యొక్క ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ డిమాండ్ చేశారు. లేనియెడల త్వరలోనే ఈనెల 22న హైదరాబాద్ నగరంలోని సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని అప్పటికి ప్రకటన చేయకపోతే గౌరవ న్యాయ స్థానాలను ఆశ్రయించైనా సరే కార్మికులకున్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపుకృష్ణ కొత్తగూడెంఏరియా ఉపాధ్యక్షులు గడప రాజయ్య,, నాయకులు వసి కర్ల కిరణ్, మురళి, బోరింగ్ శంకర్, ఈశ్వర్,అరుణ్ అశోక్, కుమార్, వెంకటేష్, సూరజ్, సూర్యనారాయణ, శ్రీనివాస్, అనుదీప్, రాజేష్, శ్రీకాంత్ ఇబ్రహీం, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :