తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తగూడెం కార్పొరేషన్ 15వ డివిజన్లో ఓటరు సవరణ ప్రక్రియను పరిశీలించారు. దగ్గరుండి 177వ పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్ల ఎన్యుమరేషన్ ఫామ్ లను రాశారు. బూత్ లెవల్ అధికారి రాధిక, బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఖాజా భక్ష్, వాసుకి, సుందర్ పాసితో కలిసి పరిశీలించారు. అర్హులైన పౌరులకు ఓటు హక్కు పక్కాగా కల్పించాలని సూచించారు. అనర్హులను ఓటరు జాబితాలో లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని తెలిపారు. బీఆర్ఎస్ బీఎల్ఏలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫామ్ నింపడంలో సహాయపడాలన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ