తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 14 (తెలుగు వెలుగు) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత లోపించిందని భారతీయ జనతా పార్టీ (బీ జే పీ) జిల్లా నాయకుడు గొడుగు శ్రీధర్ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ మేనేజర్ ప్రసాద్ కు పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసీ మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక, లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ కమిటీలకు సంబంధం లేకుండా, మాజీ కౌన్సిలర్లు, అధికార పార్టీ నాయకులకు సంబంధించిన అర్హులు కాని వారికి ఇండ్లు మంజూరు చేశారని, ఎంపిక విషయాలలో భారీగా అవకతవకలు జరిగాయని వివరించారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్, పట్టణ నాయకులు గూడ విజయ, గుంపుల మహేష్ , రాంబాబు నాయక్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ