తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.ప్రజా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పిస్తున్నాం. కొత్తగూడెం నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతాం.పార్టీలకతీతంగా పెదవర్గాలకు సంక్షేమ ఫలాలు. కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. రూ.1.95కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.కార్పొరేషన్ పరిధిలోని గ్రామాల రూపురేఖలు మార్చేలా సమగ్ర అభివృద్ధి పనులు చేపడుతున్నామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. సుజాతనగర్ మండల పరిధిలోని కార్పొరేషన్ డివిజన్‌లో రూ.1.95 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, డ్రైనేజీలు, మరుగుదొడ్లు, బస్ షెల్టర్ల నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుజాతనగర్ కార్పొరేషన్ ప్రాంతంగా మారిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించామని చెప్పారు. ప్రతీ గ్రామంలో తాగునీరు, వీధిదీపాలు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, సుజాతనగర్ నుండి శివాలయం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నిధులు అందుబాటులోకి తెచ్చామన్నారు. సుజాతనగర్‌లో మున్సిపల్ సబ్ డివిజన్ కార్యాలయ ఏర్పాటుతో పాటు, సింగభూపాలెం చెరువుకట్ట అభివృద్ధి కోసం రూ.5.5 కోట్లు మంజూరు కానున్నట్లు వెల్లడించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ (న్యాక్) కేంద్రం మంజూరైందని,అదేవిధంగానియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రగతికి అవసరమైన నిధుల కోసం నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనులు వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, సొసైటీ అధ్యక్షులు మండే హనుమంతరావు, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, మున్సిపల్ కమిషనర్ సుజాత, కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ భారతి, ఏఓ నర్మద, విద్యుత్ శాఖ ఏఈ కిషన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భూక్య దస్రు, మండల కార్యదర్శి కుమారి హనుమంతరావు, నాయకులు జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల రాములు తాళ్ల వెంకటేశ్వర్లు, తాళ్లూరి పాపారావు మండల నాయకులు వీర్ల మల్లేష్, దుర్గాప్రసాద్, బొడ్డు కేశవరావు, కొమారి కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ