Tuesday, 28 July 2026 05:12:21 AM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు పాటుపడాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

Date : 26 September 2025 04:53 PM Views : 279

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూమి కోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమించారని చెప్పారు. ఇలాంటి మహానీయుల చరిత్రను భావితరాలకు అందించి వారి ఆశయాలకు అనుగుణంగా అందరు సమిష్టిగా పని చేయాలని అన్నారు.1940-44 మధ్య కాలంలో విస్నూర్‌లో దేశ్‌ముఖ్‌, రజాకార్ల ఆరాచకాలపై ఎదురు తిరిగి పోరాట యోధురాలు ఐలమ్మ అని, తెలంగాణ రైతాంగ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళల్లో స్ఫూర్తిని నింపిన వీర వనిత అని కొనియాడారు. చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను గుర్తుచేస్తూ వారి ఆశయాలను మనం పూర్తిగా సాధించేందుకు కృషి చేయాలని, తద్వారా సమాజాభివృద్ధికి తోడ్పడినట్లు అవుతుందని అన్నారు. వారి పోరాటాలు, ఆశయాలు అందరికి తెలియాలని రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.ఈ కార్యాక్రమంలో పి. విజయలక్ష్మీ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి, జిల్లా అధికారులు మరియు బి.సి.సంఘ నాయకులు నేరెళ్ళ రమేష్ , అజిత్ కుమార్ , సర్వేశ్ , కె. వసంత రావు , బి. శ్రీనివాస్ , ఆర్. వెంకటయ్య , ఎం. బిక్షం , బి. జయమ్మ , కొదుమురి సత్యనారాయణ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :