Tuesday, 28 July 2026 12:21:23 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

ఇందిరమ్మ గృహాల మంజూరులో సర్వేను వేగవంతం చేయాలి --- రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల

Date : 28 December 2024 08:47 PM Views : 548

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న ఇందిరమ్మ పక్కా గృహాల మంజూరులో సర్వే అధికారులు సర్వేను వేగవంతం చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు కమీషనర్ K సుజాత ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానాల్లో ఇచ్చిన పేదలకు 5 లక్షలతో ఇంటి నిర్మాణానికి సాయం హామీ మేరకు ప్రజాపాలన సభలలో దరఖాస్తులు స్వీకరించిందన్నారు. మంజూరు విషయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వే టీం చర్యలు చేపట్టాలని కొత్వాల అన్నారు. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దు --- కొత్వాల ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారుని వివరాలు సేకరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారనీ, సర్వేలో ఆలస్యమైనా ఆందోళన చెందవద్దనీ కొత్వాల అన్నారు. లబ్ధిదారుని ఇంటి స్థలంకు సంబందించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకున్నా సాదాబైనామా, ఎగ్రీమెంట్ డాక్యూమెంట్లతో మంజూరు చేసేలా అధికారులను కోరామన్నారు. దరఖాస్తుదారు అడ్రస్ దొరకక పోయినా, దానిపై విచారించి ప్రతి ఒక్క దరఖాస్తును సర్వే చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని కొత్వాల అన్నారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, LDM కోఆర్డినేటర్ బద్ది కిషోర్, మాజీ ZPTC సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, కాంగ్రెస్ నాయకులు బాలినేని నాగేశ్వరరావు, కందుకూరి రాము, పైడిపల్లి మహేష్, కాపా శ్రీను, SK చాంద్ పాషా, ఉండేటి శాంతివర్ధన్, మాలోత్ కోటి నాయక్, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :