తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : అశ్వారావుపేటలో తల్లి బైక్ కొనివ్వలేదని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అశ్వారావుపేట ఫైర్ కాలనీకి చెందిన చీకటి స్వామి(20) గత కొన్ని రోజులుగా బులెట్ బైక్ కొనివ్వాలని తల్లిని అడుగుతున్నాడు. ఇవాళ ఖర్చులకు డబ్బులు అడగడంతో తల్లి నిరాకరించడంతో మనస్తాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ