తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సెప్టెంబర్ 19 శుక్రవారం సాయంత్రం గుర్తింప సంఘం ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి వి మల్లికార్జున్ రావు ఆధ్వర్యం లో జిఎం కార్యాలయం ఎదుట భారీఎత్తున ధర్నా,ముట్టడి చేసి జిఎం షాలెం రాజు కి మెమొరాండం ఇచ్చారు అనంతరం అనంతరం అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్యా మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండించారు,మరియు సి&యండి తో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికుల కోసం ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని,అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35% లాభాల వాటాను కార్మికులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మరియు కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని కోరారు,లేనిపక్షం లో కార్మికుల హక్కుల కోసం పోరాటం తప్పదని పేర్కొంటూ,సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెకు సైతం పిలుపునిస్తాం అని యాజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ ధర్నా కార్యక్రమం లో,కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి,సహాయ కార్యదర్శిలు గట్టయ్య, రాము,వైస్ ప్రెసిడెంట్ శేషగిరిరావు,సత్తుపల్లి కార్యదర్శి సుధాకర్,ఆఫీస్ బెర్రర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, హీరలాల్, కుర్రు రమేష్,పిట్ కార్యదర్శిలు ,మధుకృష్ణ, కిషోర్, నర్సింరావు, సౌజన్య, భరణి,సీనియర్ నాయకులు, సురేందర్,మురళి,క్రిస్టోఫర్, గుమ్మడివీరయ్య,కోటి,రవి,కుమారకృష్ణ, భుక్యరమేష్,బoడి వెంకటరమణ, కుమార్,మహిళా కార్మికులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ