Tuesday, 28 July 2026 02:44:42 PM
# విద్యార్థుల ఉసురుతీసిన నీట్ కుంభకోణం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని. # రూ.2 కోట్లతో పూర్తయిన సెంట్రల్ లైటింగ్, టూవే లైన్ రోడ్డులో ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # అనంతారం గ్రామంలో రైతు సదస్సు, నీటి సంరక్షణ పై అధికారుల అవగాహన. # బొగ్గు ఉత్పత్తి సాధనలో కార్మికుల సమిష్టి కృషి అభినందనీయం. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) షాలెం రాజు. # 16వ డివిజన్లో ప్రారంభమైన తొలిముద్ద - బాల భరోసా చిన్నారులకు తొలిముద్ద ను వడ్డిస్తున్న డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ. ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మాదకద్రవ్యాల నియంత్రణపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ . # కొత్తగూడెం ఏరియా జీఎం షాలెంరాజుకు ఘన వీడ్కోలు. పదవీవిరమణ శుభాకాంక్షలు తెలిపిన ఆర్‌సీహెచ్‌పీ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు. # జెన్ జీ నీ తెలంగాణ విద్యాశాఖ మంత్రినీ చేయాలి..జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # సుజాతనగర్ మండల సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # శ్రీరాముడు కొలువైన జిల్లాలో పనిచేయటం అదృష్టం -సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వి సూర్యనారాయణ. # ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి : వ్యవసాయ శాఖ అధికారి బాబురావు. # ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలపై జనసేన పోరాటం. గడల శ్రీనివాసరావు. # దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. # ప్రతి మెడికల్ బోర్డు దరఖాస్తుదారుడికి ఇన్వాలిడేషన్ కల్పించాలి-ఎఐటియుసి నేత మిరియాల రంగయ్య డిమాండ్. # విద్యార్థి పోరాటాలకు తలవంచక తప్పదు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వర్క అజిత్. # విద్యార్థుల ఐక్య పోరాట ఫలితమే ధర్మేంద్ర ప్రధాన రాజీనామా. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా # భద్రాచలంలో 101 కిలోల డ్రై గంజాయి స్వాధీనం. # వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ విజయవంతం.

69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు. రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లు.

Date : 08 January 2026 09:08 PM Views : 332

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన రెండో రోజు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగి క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో వివిధ రాష్ట్రాలు, జాతీయ స్థాయి విద్యా సంస్థల జట్లు అత్యంత పోటీతత్వంతో తలపడుతూ విజయం కోసం హోరాహోరీగా పోరాడాయి.ఉదయం సెషన్‌లో మధ్యప్రదేశ్ 50–40తో పంజాబ్‌పై, విద్యాభారతి 55–40తో కేవీఎస్‌పై, ఒడిశా 52–43తో చండీగఢ్‌పై గెలుపు సాధించాయి. ఆంధ్రప్రదేశ్ 70–43తో త్రిపురపై ఘన విజయం సాధించగా, పుదుచ్చేరి 60–46 తో సీఐఎస్‌సీఈను మట్టికరిపించింది. తెలంగాణ జట్టు 46–40తో తమిళనాడుపై విజయం సాధించగా, కర్ణాటక 40–35తో ఢిల్లీని, మహారాష్ట్ర 41–34తో హిమాచల్ ప్రదేశ్‌ను ఓడించాయి. రాజస్థాన్ జట్టు 34–22 తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలుపొందింది. మధ్యాహ్నం సెషన్‌లో హర్యానా 71–25తో కేవీఎస్‌పై ఆధిపత్యం చూపింది. మధ్యప్రదేశ్ 52–35తో ఎన్వీఎస్‌ను, మణిపూర్ 49–34తో జార్ఖండ్‌ను, సీబీఎస్‌ఈ 39–35తో పశ్చిమ బెంగాల్‌ను ఓడించాయి. గుజరాత్ 38–32తో జమ్మూ & కాశ్మీర్‌పై, కేరళ 39–35తో సీబీఎస్‌ఈ వెల్ఫేర్‌పై గెలుపొందాయి. ఉత్తరప్రదేశ్ 34–32తో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సాధించగా, విద్యాభారతి 49–38తో అస్సాం, పంజాబ్ 59–34తో ఎన్వీఎస్‌పై ఘన విజయాలు సాధించాయి. రెండో రోజు మ్యాచ్‌లలో ఆటగాళ్లు ప్రదర్శించిన శక్తి, నైపుణ్యం, వ్యూహాత్మక ఆటతీరు ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. నిర్వాహకులు తెలిపారు, రాబోయే రోజుల్లో పోటీలు మరింత ఉత్కంఠభరితంగా కొనసాగనున్నాయి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :